అరకు లోయకు న్యాయమూర్తులు...! 1 d ago
ఏపీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖాన్ తోపాటు 25 మంది న్యాయమూర్తులు ఈ నెల 12న అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో పర్యటించనున్నారని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. వీరంతా గిరిజన మ్యూజియం, గ్రామదర్శనం, హరిత హిల్ రిసార్ట్, బొర్రాగుహలు సందర్శించనున్నారని ఆయన తెలిపారు. స్థానిక స్థితిగతులను, అక్కడ పరిస్థితులను నేరుగా తెలుసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ నెల 12న పర్యాటకులకు అనుమతి ఉండదని తెలిపారు.